అగ్నికుల క్షత్రయ“జాతిపీత” జయంతి
***********************************************************************************కీ|| శే||పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు ఆంధ్రప్రదేశ్ సౌభాగ్య కేంద్రస్థానమైనా,నౌకావాణిజ్యముల కాలవాలమై,సంపన్నులకు పట్టుగొమ్మమై పేరుపోంధిన కురంగేశ్వరపురం(కోరంగి) వీరి జన్మస్ధానము. అగ్నికులక్షత్రియ వంశమందు పొన్నమండ వెంకటరెడీ,మంగమాంబ పుణ్య దంపతుల పూర్వ కృత తపఃఫలమై అవతరించిన ఆదర్శజీవి. సత్యశీలము,ఓర్పు, పట్టుదల, దయాదాక్షిణ్యామూల,విధినిర్వహనము,సంఘసేవ ధైర్యస్థైర్య ములు ఈయన గుణములు. ఇశ్వర్యవంతు లఘటవాలను ఈయన విధ్యభ్యాసము స్వగ్రామమునంధూను, కాకినాడ నంధు శాస్త్రోక్తముగాను శ్రద్ధతోనూ సాగినాధి ఈయన విధ్యర్ధి దశలో నున్నపుడు “అగ్నికుల క్షత్రయల అవమానములను” పసిగట్టియుండెను. సమాజమునందు అతహీనముగా చూడబడుచున్న అగ్నికుల క్షత్రయల పురోభివృధికి ధీక్ష వహించి పనిచేయవలయునని నిశ్చయుంచుకొనిరీ. నాటి నుండి సంఘ పెద్దలను కలుసుకొని అగ్ని కుల క్షత్రియ పుట్టు పూర్వోతరములను గూర్చి తెలుసుకొని గ్రంధ పరిశోధనలు గావించియున్దిరి. స్వగ్రామ మగు కోరంగియందు కమలనభా వర్మ మెమోరియల్ హాల్లు కట్టించి అందు గ్రంధాలయములు స్థాపించియుందీరి. ఈ గ్రంధాలయములో అనేక గ్రంధములను కుర్చీ మూక్యముగా అగ్నికుల క్షత్రియ గ్రంధములను, తత్సంబంధ కావ్య పురాణేతిహాసములు సేకరించి గ్రంధాలయమును అభివృధిగావించియుందీరి. కోరంగి యందు 1901లో అగ్నికుల క్షత్రయ సంఘమును స్థాపించియుందీరి. ఇధి చెన్నపూరి వహ్నికుల క్షత్రియ మహా సంఘమునకు ఉపసంఘమాముగా స్థపిన్పబదిన్ది.అన్ని రంగములంధూను మికిలి వెనకబడిన తమ చరిత్రను విస్మరించి ఎవరేమని పిలిచిన వారికాట్లే సమాధానము చెప్పుచు అస్థితులై అనేకవిధముల అనాగరియున్న అగ్నికుల క్షత్రయల సర్వతో మఖాభివృధికి సంఘముద్వారా కృషి సాగించినవారు ‘జాతిపిత’ లక్ష్మణస్వామివర్మ గారు. ఆంధ్ర, ద్రావిడ, కర్ణాట, కేరళ, ఒరిస్సా ప్రదేశములందు గల అగ్ఞీకులక్షత్రయలను అనేక నామమూలతో వడుచుండుట అన్నయమనియు ఒకే పేరున పిలవబడుచు, అట్లు వ్రాయువలయుననీయు వహ్నికుల క్షత్రియ సంఘ పెద్దాలతో యెస్. సింగర్వేలు నాయాకర్ గారు,నంజిప్ప నాయాకర్ గారు, మాణిక్యవేలు నాయాకర్ గారు మద్రాస్ శాసనసభలో 1928వ సం: జనవరి నెలలో తీర్మానం పెట్టి అనుమతి పొందిరి. మద్రాస్ గవర్నరుగారిని కలుసుకొని ఆంద్రదేశమునందు అగ్ఞీకుల క్షత్రయుల అగచట్లను వివరించెను. భారతదేశా వైస్ రామ్ గారిని కలుసుకొని రోడ్లు, వంతెనలు, గాయళ్లు భూములు సాగుబడి, పాటశలల స్థాపన, అడవులు, మత్స్యపరీశ్రమ మున్నగు అంశములపై గల కోర్కెలను తెలియాచెప్పి ఆ కోర్కెలను సఫలీకృతం చేసిరి. కాకినాడ కోరంగి రోడ్డుమర్గమున నున్న మాట్లపాలమువద్ద తమ తల్లి పేరున ఒక విశ్రాంతి మందిరమును కట్టించి చలివేంద్రం నేర్పాటుచేశారు. క్రీ. శ.1890వ సం:రమున ఆంద్ర దేశమున ప్రప్రధమముగా శాస్త్రీయ ఆయుర్వేధా వైధ్యశాలను కోరంగీలో స్థాపించారు. కోరంగియందు పేదలగు రోగులకు ఉచితముగా మంధులను నిచి ఎంతయో సేవచేసిరి. ఈ వైధ్యశాలను సంఘసభలకు వినియోగించి తద్వారా సంఘాభివృధికి కృషిచేశారు. ఆయన సాంఘీయులను దుఖసాగరమున ముంచి 1944 సం. న పరమపధించిరి. ఆయన కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపించినది. ఆయన అగ్నికుల క్షత్రియులందరికి ఆయన “జాతిపీత” గా పిలవబడ్డారు.

No comments:
Post a Comment